News February 1, 2025

నేతల మధ్య అంతరాలు లేకుండా చూడాలి: సీఎం

image

TG: ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మంత్రులతో సీఎం నిర్వహించిన అత్యవసర భేటీలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.

Similar News

News February 1, 2025

కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు

image

☞ వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1.71లక్షల కోట్లు
☞ విద్య- రూ.1.28 లక్షల కోట్లు
☞ ఆరోగ్యం-రూ.98,311 కోట్లు
☞ పట్టణాభివృద్ధి-రూ.96,777 కోట్లు
☞ ఐటీ, టెలికం-రూ.95,298 కోట్లు
☞ విద్యుత్- రూ.81,174 కోట్లు
☞ వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
☞ సామాజిక సంక్షేమం-రూ.60,052 కోట్లు

News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

image

AP: కేంద్ర బడ్జెట్‌ను CM చంద్రబాబు స్వాగతించారు. వార్షికాదాయం రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామం అని చెప్పారు. PM మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలకు CM అభినందనలు చెప్పారు.

News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..

image

ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr