News February 1, 2025

నేతల మధ్య అంతరాలు లేకుండా చూడాలి: సీఎం

image

TG: ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మంత్రులతో సీఎం నిర్వహించిన అత్యవసర భేటీలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.

Similar News

News February 10, 2025

స్కిల్ వర్సిటీకి నిధులివ్వలేం: కేంద్రం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం షాక్ ఇచ్చింది. దానికి నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా INC MP చామల కిరణ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి నిధులిచ్చే పథకమేమీ కేంద్రం వద్ద లేదని మంత్రి జయంత్ చౌదరి తేల్చి చెప్పారు.

News February 10, 2025

కామెడీ షోలో బూతులు.. పోలీసులకు ఫిర్యాదు

image

కామెడీ షోలో అసభ్యంగా బూతులు మాట్లాడిన వారిపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వ మఖీజా, కమెడియన్ సమయ్ రైనా అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. బూతులే కామెడీ అనుకుంటున్నారా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News February 10, 2025

విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?

image

AP: గుంటూరు సీఐడీ విచారణకు నేడు డైరెక్టర్ RGV గైర్హాజరయ్యారు. దీంతో రేపు మళ్లీ నోటీసులివ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని RGV 8 వారాల సమయం కోరారు. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదిని CID కార్యాలయానికి పంపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై TDP నేతల ఫిర్యాదు మేరకు CID ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!