News August 7, 2024
మన రెజ్లర్లపై కుట్ర జరిగింది: విజేందర్ సింగ్

వినేశ్ ఫొగట్ అనర్హత వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ 100 గ్రాముల్ని తగ్గించుకునేందుకు ఒలింపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాలన్నారు. ‘ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. భారత రెజ్లర్లపై ఏదో కుట్ర జరుగుతోంది. బహుశా కొంతమంది మన సంతోషాన్ని చూడలేకపోతున్నారేమో! ఒక రాత్రిలోనే ఐదారు కిలోలు తగ్గుతుంటాం. 100 గ్రాములకు సమస్యేముంది?’ అని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
ఉదయగిరి వాళ్లు బాగా సంపాదించారు: సీఎం

ఉదయగిరికి పరిశ్రమలు వస్తాయని ఎవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వింజమూరులో ఆయన మాట్లాడుతూ.. ‘పంటలు పండకపోవడంతో ఉదయగిరి ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉదయగిరిలో డబ్బులు లేవు కానీ.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన వాళ్లు బాగా సంపాదించారు. వాళ్లంతా ఉదయగిరిలో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికే ఇక్కడికి రెండు పరిశ్రమలు వచ్చాయి. ఉదయగిరిని టూరిస్ట్ ప్లేస్‌గా మారుస్తా’ అని CM ప్రకటించారు.
News April 1, 2026
TNలో అల్లర్లకు BJP కుట్ర: స్టాలిన్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ BJPపై CM స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు BJP కుట్ర పన్నిందని, దాన్ని అధికార DMK భగ్నం చేసిందని చెప్పారు. BJP పాలిత రాష్ట్రాలైన UP, మణిపుర్‌లో కొనసాగుతున్న మూక దాడులు, మత ఘర్షణలు TNలో లేవని ఎద్దేవా చేశారు. DMK ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు రూ.8వేల కూపన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
News April 1, 2026
వాణిజ్య పంటలు సాగుచేస్తే రూ.10,000!

TG: వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేసే రైతులకు ఎకరాకు ₹10,000 ప్రోత్సాహకం ఇవ్వాలని GOVT భావిస్తోంది. పప్పుధాన్యాలు, మార్కెట్లో డిమాండ్ ఇతర వాణిజ్య పంటల సాగుకు మారే రైతులకు దీన్ని అందించనున్నారు. దీనిపై CM రేవంత్ అధికారులతో చర్చిస్తున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఎకరాకు ₹20,000 వెచ్చిస్తోంది. పైగా నిల్వ చేయడం సవాలుగా మారుతోంది. పంజాబ్‌లో రైతులకు ₹17,000 ప్రోత్సాహకం ఇచ్చే స్కీమ్ అమల్లో ఉంది.


