News May 25, 2024

మిథాలీతో నా వివాహమంటూ చాలా రూమర్స్ వచ్చాయి: ధవన్

image

గతంలో తనపై వచ్చిన రూమర్స్‌ గురించి క్రికెటర్ శిఖర్ ధవన్ తాజాగా షేర్ చేసుకున్నారు. ‘ఒకానొక టైమ్‌లో నేను మహిళా జట్టు మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. కానీ అవన్నీ ఫేక్. ఇలాంటి ఆరోపణలే నాపై చాలా వచ్చాయి’ అని గబ్బర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తన కంటే పదేళ్లు పెద్దదైన ఆయేషాను శిఖర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధల కారణంగా విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు.

Similar News

News February 13, 2025

అన్‌లిమిటెడ్ పానీపూరీ.. ఎక్కడంటే?

image

వినోదాన్ని పొందేందుకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నట్లుగానే పానీపూరీ తినేందుకు ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం అన్‌లిమిటెడ్ పానీపూరీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఒకేసారి డబ్బు చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ ఆఫర్ తీసుకున్నవారు ఏ సమయంలోనైనా షాప్‌కి వచ్చి పానీపూరీ తినొచ్చని తెలిపాడు. గతంలోనూ బాహుబలి పానీపూరీ పేరుతో ఆయన క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించారు.

News February 13, 2025

వైట్‌హౌస్‌లో పిల్లలతో అధ్యక్షులు

image

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లో సందడిగా గడిపారు.

News February 13, 2025

ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా..!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటిస్తున్నట్లు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. డార్లింగ్‌, డైరెక్టర్‌తో దిగిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రభాస్ లుక్ రివీల్ కాలేదు. ఫొటోలో సైడ్ క్రాఫ్ హెయిర్ స్టైల్‌తో ట్రిమ్మ్‌డ్ బియర్డ్‌తో ఫార్మల్‌ డ్రైస్‌లో డార్లింగ్ కనిపించారు. ప్రభాస్ లుక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.

error: Content is protected !!