News August 14, 2025
థియేటర్లలో మారణహోమం జరుగుతుంది: NTR

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. ‘ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 మూవీపై గర్వంగా ఉన్నాను. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అంతా ‘కొడుతున్నాం అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News August 14, 2025
భారత్‌పై ట్రంప్ వైఖరి తప్పు: US Ex NSA

భారత్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోల్టన్ తప్పుబట్టారు. ‘రష్యా ఆయిల్ కొంటున్నారన్న సాకుతో ఇండియాపై 25%(ఓవరాల్ 50%) అదనపు టారిఫ్స్ వేయడం తప్పు. చైనాకు ఎందుకు అలాంటి సుంకాలు విధించలేదు? ట్రంప్ చర్యలతో అమెరికా మళ్లీ భారత్ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. నా సలహా ఏంటంటే.. భారత్ కూడా పాక్‌లా ట్రంప్‌ని నోబెల్ కోసం సిఫార్సు చేయాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు.
News August 14, 2025
ట్రంప్ టారిఫ్స్‌కు బ్రెజిల్ కౌంటర్ ప్లాన్స్

బ్రెజిల్‌పై US అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్స్‌కు ఆ దేశ అధ్యక్షుడు లూలా కౌంటరిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. టారిఫ్స్‌తో ఎఫెక్ట్ అయిన దేశాధినేతలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జిన్‌పింగ్, మోదీలాంటి నేతల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. టారిఫ్స్‌తో నష్టపోతున్న వారి ఎగుమతిదారులకు 5.5 బి. డాలర్ల క్రెడిట్ లైఫ్‌లైన్, చిన్న పరిశ్రమలకు ట్యాక్స్ క్రెడిట్స్ ప్రకటించారు.
News August 14, 2025
IMPS చెల్లింపులపై ఛార్జీలు పెంపు: SBI

IMPS(ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) చెల్లింపులపై ఛార్జీలను పెంచుతూ SBI నిర్ణయం తీసుకుంది. ఆగస్టు15 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. బ్రాంచ్ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీల్లో మార్పులేదు. ఆన్‌లైన్‌లో 25 వేలు-రూ.లక్షలోపు రూ.2, రూ.లక్ష-2 లక్షలలోపు రూ.6, రూ.2 లక్షల-రూ.5 లక్షలలోపు రూ.10 ఛార్జీలు+GST చెల్లించాలి. శాలరీ అకౌంట్స్‌ను మినహాయించారు. కార్పొరేట్ కస్టమర్లకు ఇవి SEP 8 నుంచి అమలులోకి రానున్నాయి.