News December 31, 2024
మంత్రుల మార్పు ఉండదు: పల్లా శ్రీనివాస్

AP: YCP హయాంలో BCలను అణగదొక్కారని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. తమ ప్రభుత్వంలో వారికి న్యాయం జరుగుతోందన్నారు. అసమర్థత, అవినీతి ఆరోపణల విషయంలో తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని స్పష్టం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి బొత్స కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారనేది తప్పుడు ప్రచారమన్నారు. SMలో వచ్చిన సమాచారం TDP కంట్రోల్లో ఉండదని చెప్పారు.
Similar News
News November 27, 2025
పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

పీరియడ్స్లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.
News November 27, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికల్లోనూ స్ట్రాటజిస్టుల ఎంట్రీ!

TG: ఇప్పటివరకు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకే పరిమితమైన వ్యూహకర్తలు, ఏజెన్సీలు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లోకీ ఎంట్రీ ఇచ్చాయి. ‘ప్రచారం ఎలా చేయాలి? ప్రజలతో ఎలా మాట్లాడాలి? సర్వే చేసి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? విజయావకాశాలు ఎలా పెంచుకోవాలి?’ వంటి అంశాలన్నీ తామే చూసుకుంటామని SMలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలే టార్గెట్గా అభ్యర్థులకు స్ట్రాటజిస్టులు వల విసురుతున్నారు.


