News December 31, 2024

మంత్రుల మార్పు ఉండదు: పల్లా శ్రీనివాస్

image

AP: YCP హయాంలో BCలను అణగదొక్కారని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. తమ ప్రభుత్వంలో వారికి న్యాయం జరుగుతోందన్నారు. అసమర్థత, అవినీతి ఆరోపణల విషయంలో తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని స్పష్టం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి బొత్స కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారనేది తప్పుడు ప్రచారమన్నారు. SMలో వచ్చిన సమాచారం TDP కంట్రోల్‌లో ఉండదని చెప్పారు.

Similar News

News January 19, 2025

‘పరీక్షా పే చర్చ’కు భారీగా అప్లికేషన్లు

image

ప్రధాని మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి 3.5 కోట్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ చర్చిస్తారు. కాగా పరీక్షా పే చర్చా ఎడిషన్-8 నిర్వహణ తేదీ ఇంకా ప్రకటించలేదు.

News January 19, 2025

చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్‌ విడుదలవగా చాలా చోట్ల హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో రిలీజైన 45వ రోజున కూడా ఓ సినిమాకు హౌస్ ఫుల్ పడటం ఇదే తొలిసారి అని సినీవర్గాలు పేర్కొన్నాయి. 20+నిమిషాలు యాడ్ అవడం సినిమాకు ప్లస్ అయినట్లు తెలిపాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

News January 19, 2025

శాంసన్‌కు CTలో నో ప్లేస్.. రాజకీయ దుమారం

image

సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా కెరీర్‌ను నాశనం చేశారని MP శశిథరూర్ ఆరోపించారు. ఈ విషయంలో KCAకు బాధ లేదా అని ప్రశ్నించారు. SMAT, VHTల మధ్య ట్రైనింగ్‌కు హాజరుకానందుకు చింతిస్తూ ఆయన లేఖ రాసినా వేటు వేశారని మండిపడ్డారు. ఈ విషయంపై KCA ప్రెసిడెంట్ జార్జ్ స్పందిస్తూ శాంసన్ క్రమశిక్షణ పాటించలేదన్నారు. VHTలో ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు దూరమయ్యారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.