News July 15, 2024

కాంగ్రెస్‌లో చేరిన 10 మంది MLAలు వీరే..

image

2023 ఎన్నికల తర్వాత 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
*తెల్లం వెంకట్ రావు- భద్రాచలం *కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్
*దానం నాగేందర్- ఖైరతాబాద్ *పోచారం శ్రీనివాస్ రెడ్డి- బాన్సువాడ *సంజయ్ కుమార్- జగిత్యాల *కాలే యాదయ్య- చేవెళ్ల *బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల *ప్రకాశ్ గౌడ్- రాజేంద్రనగర్ *అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి *గూడెం మహిపాల్ రెడ్డి- పటాన్‌చెరు

Similar News

News October 6, 2024

తొలి టీ20 నెగ్గేదెవరో?

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్లు బంగ్లా జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 టీ20లు జరగ్గా భారత్ 13 విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచులో గెలుపొందింది. కాగా గ్వాలియర్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.

News October 6, 2024

నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

image

TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈఏపీసెట్-2024 క్వాలిఫై అయిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపింది.

News October 6, 2024

హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

image

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.