News March 29, 2024
మట్టి కుండలో నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!
ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
Similar News
News January 26, 2025
మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News January 26, 2025
అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.
News January 26, 2025
టీ20ల్లో అరుదు
SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది.