News March 2, 2025
వాకింగ్‌కు బెస్ట్ ప్లేస్, టైమ్ ఇవే..

ట్రెడ్‌మిల్, కారిడార్ల కంటే ప్రకృతి ప్రదేశాల్లో వాకింగ్‌తో అధిక లాభాలుంటాయని ఫిజియాలజిస్ట్ మెక్ డోవెల్ తెలిపారు. పచ్చికలు, బీచ్, కొండ శివార్లు తదితర నేచర్ సహిత ప్రదేశాల్లో నడకతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందట. నరాల-కండరాల సమన్వయం పెరగడంతో పాటు ఒత్తిడి పెంచే కార్టిసాల్ అదుపులోకి వచ్చి, ఎండార్ఫిన్ ఉత్తేజం అవుతుందన్నారు. ఉదయం గం.5:30-8:00, సాయంత్రం గం.4:30-7:00 మధ్య వాక్ మంచి ఫలితాలు ఇస్తుందట.
Similar News
News March 27, 2025
ఇంట్లో ఒకే బిడ్డ ఉంటే..!

తోబుట్టువులు లేకుండా పెరిగే పిల్లల్లో చాలా మంది ‘ఓన్లీ చైల్డ్ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు సొంత అవసరాలు, కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో స్వార్థపరులుగా మారుతారు. ఇంట్లో ఒంటరితనాన్ని అనుభవించడంతో ఇతరులతో త్వరగా కలిసిపోలేరు. బాల్యమంతా ఏకాంతాన్ని అనుభవిస్తారు. షేరింగ్, అండర్‌స్టాడింగ్, సాల్వింగ్ వంటివి నేర్చుకోవడంలో వెనకబడతారు. పేరెంట్స్‌పై ఎక్కువ ఆధారపడతారు.
News March 27, 2025
కరుణ్ నాయర్‌కు BCCI నుంచి పిలుపు?

విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు BCCI ఆయనను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఇండియా-A జట్టులో ఆయనకు చోటు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. కరుణ్ కొద్దిరోజులుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో 5, SMATలో 3 సెంచరీలు బాదారు. దీంతో ఆయనను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి.
News March 27, 2025
కొడాలి నానికి ఆపరేషన్

AP: YCP నేత కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు HYDలోని AIG డాక్టర్లు నిర్ధారించారు. ఆయన గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లు గుర్తించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. మరికొన్ని వైద్య పరీక్షల అనంతరం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి ఆరోగ్యంపై మాజీ CM జగన్ డాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు నాని అనారోగ్యం విషయం తెలిసి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.