News April 24, 2024

ఇవాళ నామినేషన్లు వేసిన ప్రముఖులు వీరే?

image

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ఇవాళ కొందరు ప్రముఖులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్-పిఠాపురం, విజయసాయిరెడ్డి-నెల్లూరు MP, సత్యకుమార్-ధర్మవరం, ప్రత్తిపాటి పుల్లారావు-చిలకలూరిపేట, పేర్ని కిట్టు-మచిలీపట్నం, కారుమూరి సునీల్-ఏలూరు MP, స్వామి పరిపూర్ణానంద-హిందూపురం(IND), కాసాని జ్ఞానేశ్వర్(BRS), రంజిత్ రెడ్డి(INC)-చేవెళ్ల MP, బర్రెలక్క(IND), మల్లు రవి-నాగర్ కర్నూల్ ఎంపీ.

Similar News

News January 22, 2025

భార్యతో సెల్ఫీ ఎంత పని చేసింది

image

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే. భార్యతో దిగిన సెల్ఫీనే తన మరణానికి దారితీస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. 2016లో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోన్ పోలీసులకు చిక్కింది. దీని ఆధారంగా లొకేషన్‌ ట్రేస్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో చలపతి సహా 27 మంది మావోలు చనిపోయారు.

News January 22, 2025

ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్

image

ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటోడ్రైవర్‌కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భజన్ సింగ్‌కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

News January 22, 2025

పవన్‌ను ముందు పెట్టి బీజేపీ డ్రామాలు: అద్దంకి

image

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ‘చంద్రబాబుతో కయ్యం తమ పార్టీ ఉనికికే ప్రమాదమని బీజేపీకి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మిత్ర పార్టీలతో లబ్ధి పొంది, ఆ పార్టీలను అంతం చేయడం బీజేపీకి ఉన్న అలవాటే. రాజకీయ స్వార్థమే ఆ పార్టీని పతనం వైపు నెడుతోంది’ అని విమర్శించారు.