News November 2, 2024
HYD మెట్రో రెండో దశలో నిర్మించే కారిడార్లు ఇవే
కారిడార్-4: నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు(36.8కి.మీ)
కారిడార్-5: రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్(11.6కి.మీ)
కారిడార్-6: MGBS నుంచి చాంద్రాయణగుట్ట(7.5కి.మీ)
కారిడార్-7: మియాపూర్ నుంచి పటాన్‌చెరు(13.4కి.మీ)
కారిడార్-8: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్(7.1కి.మీ)
కారిడార్-9: శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ
Similar News
News December 4, 2024
కాసేపట్లో ‘పుష్ప-2’ పబ్లిక్ టాక్
వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు థియేటర్లలో సినిమాను వీక్షిస్తున్నారు. ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో సినిమా ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపిస్తారా? పుష్ప కంటే పుష్ప-2లో సుకుమార్ అంతకుమించి ఏం చూపించారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మరికాసేపట్లో WAY2NEWS పబ్లిక్ టాక్. STAY TUNED.
News December 4, 2024
వియత్నాంలో విచిత్ర ట్రెండ్.. అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!
వియత్నాంలో ఓ విచిత్రమైన ట్రెండ్ ఊపందుకుంది. పెళ్లి విషయంలో పేరెంట్స్, చుట్టాల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు అక్కడి అమ్మాయిులు బాయ్‌ఫ్రెండ్స్‌ను అద్దెకు నియమించుకుంటున్నారు. పెళ్లెప్పుడు అని ఎవరైనా అడిగితే చాలు.. వెంటనే అద్దె ప్రియుడిని చూపించి ఆల్రెడీ లవ్‌లో ఉన్నా అని కవర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అబ్బాయిల్ని సరఫరా చేసే సంస్థలు కూడా అక్కడ పుట్టుకురావడం ఆసక్తికరం.
News December 4, 2024
చై-శోభిత పెళ్లికి తరలివచ్చిన సెలబ్రిటీలు
అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య-శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రానా, అడవి శేష్, కీరవాణి, టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్, సుహాసిని, అశోక్ గల్లా, చందూ మొండేటి తదితరులు హాజరయ్యారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.