News June 19, 2024

‘నలందా’ కొత్త క్యాంపస్ విశేషాలు ఇవే

image

శిథిలమైపోయిన విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాలని నలందా యూనివర్సిటీ యాక్ట్ పేరుతో 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. 2014లో 14 మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీ కార్యకలాపాలు మొదలయ్యాయి. 2017లో కొత్త క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైంది. 455 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్‌‌ను సోలార్ ప్లాంట్, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ మొదలైనవి ఏర్పాటు చేసి పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు.

Similar News

News September 15, 2024

రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసిన నాని మూవీ

image

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పుడు సరిపోయిందంటూ రాసుకొచ్చింది. గత నెల 29న థియేటర్లలో విడుదలైన ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీలో సూర్య నటన, జేక్స్ బెజోయ్ మ్యూజిక్‌కు సినీ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

News September 15, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

image

TG: ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారో? లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ CM రేవంత్ రెడ్డికి KTR లేఖ రాశారు. ‘ప్రాజెక్టును రద్దు చేస్తే భూములు ఇచ్చిన రైతులకు తిరిగి వారి భూములు అప్పగించండి. ఆ భూముల్ని ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవు. అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో HYDను నం.1గా చేసేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టాం. రాజకీయాల కోసం TG యువతకు నష్టం చేయొద్దు’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 15, 2024

ఇడ్లీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

image

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇడ్లీ తినడం వల్ల చనిపోయారు. ఓనం పండుగ సందర్భంగా అక్కడ పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సురేశ్(49) అనే వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొన్నారు. ఒకేసారి మూడు ఇడ్లీలు తినగా అవి గొంతులో ఇరుక్కున్నాయి. ఊపిరాడక కుప్పకూలిన అతన్ని నిర్వాహకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.