News April 13, 2025
తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన ముంబై పేలుళ్ల సూత్రదారి తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని NIA ఆఫీస్‌లో ఉంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు పెన్ను, పేపర్‌లతో పాటు ఖురాన్ ఇవ్వాలని అధికారులను కోరారట. దీంతో వాటిని అందజేశారు. ఇతర ఖైదీల మాదిరిగానే రాణాని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం భారత్‌కు వచ్చిన రాణాకు ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది.
Similar News
News April 14, 2025
నేను చేసిన స్కోరుకు విలువే లేదు: కరుణ్ నాయర్

IPL: ఢిల్లీ ప్లేయర్ కరుణ్ నాయర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తాను చేసిన స్కోరుకు విలువే లేదన్నారు. తనకు జట్టు విజయమే ముఖ్యమని.. ఓడిపోయిన మ్యాచ్‌లో ఎంత స్కోర్ చేసినా లాభం లేదన్నారు. ముంబైపై కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89(12 ఫోర్లు, 5 సిక్సర్లు) స్కోర్ చేశారు. తన పవర్ హిట్టింగ్‌తో బుమ్రాను సైతం వణికించారు. కరుణ్ నాయర్, పోరెల్(33) మినహా ఢిల్లీ జట్టులో బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
News April 14, 2025
SC వర్గీకరణ: 59 కులాల విభజన ఇలా..

TG: రాష్ట్రంలో 59 కులాలను 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాల(18)కు 9 శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాల(26)కు 5శాతం కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది(3.288 శాతం), గ్రూప్-2లో 32,74,377(62.749 శాతం) మంది, గ్రూప్-3లో 17,71,682(33.963 శాతం) మంది ఉన్నారు.
News April 14, 2025
SC వర్గీకరణ: ఉద్యోగాల భర్తీ ఇలా..

TG: ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-1లోని కులాలవారితో, అక్కడ మిగిలితే గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
✒ గ్రూప్-1లోని వారికి 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్-2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87,97, గ్రూప్-3లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉంటాయి.