News June 5, 2024

బీజేపీ మెజార్టీపై పాక్ మీడియా హెడ్‌లైన్లు ఇవే

image

లోక్‌సభ ఫలితాలపై పాక్ మీడియా ఆచితూచి స్పందించింది. అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ‘ఆశ్చర్యకరంగా తక్కువ మార్జిన్‌తో గెలిచిన మోదీ కూటమి’ అని డాన్ పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ‘రామ మందిరం కట్టిన చోట BJP ఓటమి, ఓటర్లు BJPని శిక్షించారన్న రాహుల్ గాంధీ’ అని బుల్లెట్ పాయింట్లు పెట్టింది. ఇక ఖతర్ కేంద్రంగా నడిచే అల్ జజీరా ‘మెజార్టీ కోల్పోవడం పీఎం మోదీ నేతృత్వంలోని కూటమికి పెద్ద దెబ్బే’ అని హెడ్‌లైన్ ఇచ్చింది.

Similar News

News November 5, 2024

టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25, రూ.200 జరిమానాతో DEC 3, రూ.500 చెల్లింపుతో DEC 10 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. వృత్తి విద్య విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.

News November 5, 2024

నిద్ర లేవగానే ఇలా చేస్తే..

image

ఉదయం నిద్ర లేవగానే 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనసు ప్రశాంతంగా ఉంచడంతో పాటు రోజంతా మీరు సమర్థంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ధ్యానం మీ అంతర్గత శక్తిని పెంచుతుంది. సానుకూల ఫలితాల వైపు పయనించేలా చేస్తుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో కాసేపు వర్కౌట్స్ చేస్తే కొవ్వు కరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

News November 5, 2024

నేటి నుంచి టెట్ దరఖాస్తులు

image

TG: విద్యాశాఖ నిన్న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అభ్యర్థులు <>schooledu.telangana.gov.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి ప్రభుత్వం టెట్ నిర్వహించింది. అనంతరం డీఎస్సీ ద్వారా 11వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసింది.