News September 10, 2024

ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఇవే

image

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16-రూ.79,900 (128GB), ఐఫోన్ 16 ప్లస్-రూ.89,900 (128GB), ఐఫోన్ 16 ప్రో-రూ.1,19,900 (128GB), ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్-1,44,900 (256GB)గా ధరలు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. 20 నుంచి విక్రయాలు జరుగుతాయి.

Similar News

News October 7, 2024

నేడు అకౌంట్లలోకి డబ్బులు

image

AP: సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది. ఎన్టీఆర్ జిల్లాల్లో 15వేలు, అల్లూరి జిల్లాలో 4,620 మంది, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. వీరందరికి దాదాపు రూ.18 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 98 శాతం మంది బాధితులకు రూ.584 కోట్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.

News October 7, 2024

ఇకపై శ్రీవారి లడ్డూలు వేగంగా పంపిణీ

image

AP: భక్తులకు శ్రీవారి లడ్డూలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దర్శన టికెట్ లేని భక్తులు తమ ఆధార్ కార్డును కౌంటర్‌లో ఇస్తే అందులోని వివరాలు ఎంటర్ చేసుకుని 2 లడ్డూలు ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం వృథా అవుతోంది. దీంతో ఆధార్‌ను క్షణాల్లో స్కాన్ చేసే అధునాతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

News October 7, 2024

టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఈవో

image

AP: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)పై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో శ్యామలరావు హెచ్చరించారు. టీటీడీని తక్కువ చేసేలా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందంటూ ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.