News October 31, 2024
కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే..
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుంది. రింకూ సింగ్ రూ.13 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.12 కోట్లు, సునీల్ నరైన్ రూ.12 కోట్లు, రస్సెల్ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్లలో హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌కు రూ.4కోట్లు వెచ్చించింది.
Similar News
News November 14, 2024
బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు
బ్రెజిల్లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.
News November 14, 2024
కార్తీక మాసంలో ఉసిరిని ఎందుకు పూజిస్తారంటే..
మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావించే ఉసిరిని కార్తీక మాసంలో పూజించి దాని వద్ద దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. ఎండ తక్కువగా ఉండే చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి ఉపకరిస్తుందని శాస్త్రీయ వివరణ. కార్తీక వన భోజనాలు సైతం ఉసిరి చెట్ల నీడలో చేయాలని పెద్దలు పేర్కొనడం గమనార్హం.
News November 14, 2024
శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం
AP: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు.