News May 25, 2024
‘కల్కి’ బుజ్జి ప్రత్యేకతలు ఇవే!

‘కల్కి 2898 ఏడీ’లోని కారు ‘బుజ్జి’ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు కోసం సియట్ వారు ప్రత్యేకంగా టైర్లు తయారు చేశారు. విదేశీ అల్యూమినియంతో అలాయ్ వీల్స్ డిజైన్ చేశారు. కారుకు 34.5 అంగుళాల రిమ్స్ అమర్చారు. దీనిని సులువుగా నడిపేందుకు ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్ ఏర్పాటు చేశారు. ఇంజిన్ కూల్‌గా ఉండేందుకు ఎయిర్ కూల్డ్ క్రిల్లోస్కర్ ఇండక్షన్ మోటార్స్ అమర్చారు. 47 కేవీ బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేశారు.
Similar News
News February 18, 2025
తక్కువ ధరకే ‘iPHONE 16 PRO MAX’.. ఎక్కడంటే?

యాపిల్ నుంచి కొత్తగా ఏ మోడల్ వచ్చినా కొనేందుకు జనం ఎగబడుతుంటారు. ప్రస్తుతం iPHONE 16 PRO MAX కాస్ట్లీయస్ట్. దీని ధరలు దేశాలను బట్టి మారుతుంటాయి. అయితే అతి తక్కువగా అమెరికాలో లభిస్తుంది. USలో కేవలం రూ.1.04లక్షలకే పొందొచ్చు. ఇక కెనడా & జపాన్‌లో రూ.1.07లక్షలు, హాంకాంగ్‌లో రూ.1.13 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.18 లక్షలు, చైనా& వియత్నాంలో రూ.1.19 లక్షలు, UAEలో రూ.1.20 లక్షలు, INDలో రూ.1.37 లక్షలుగా ఉంది.
News February 18, 2025
విజయ్‌తో డేటింగ్ రూమర్స్.. రష్మిక పోస్ట్ వైరల్

విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు❤️’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ బొకే VDనే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్‌డమ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో రష్మిక అతడిని <<15440673>>పొగుడుతూ<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
News February 18, 2025
సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.