News February 14, 2025

F-35 ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే..!

image

F-35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు US అంగీకరించింది. F-35 ఫైటర్ జెట్ గంటకు 2,000 KM వేగంతో ప్రయాణిస్తుంది. రన్ వే అవసరం లేకుండా నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది. అలాగే కిందకి దిగుతుంది. రాడార్ల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. దీని ధర రూ.695 కోట్ల నుంచి రూ.990 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో పైలట్ ఉపయోగించే హెల్మెట్ ధరే రూ.3.50 కోట్లు ఉంటుంది. వీటిని US అన్ని దేశాలకు అమ్మదు.

Similar News

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

image

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్‌ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్‌ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.

News November 13, 2025

రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.

News November 13, 2025

TG TET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.