News February 14, 2025
F-35 ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే..!

F-35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు US అంగీకరించింది. F-35 ఫైటర్ జెట్ గంటకు 2,000 KM వేగంతో ప్రయాణిస్తుంది. రన్ వే అవసరం లేకుండా నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది. అలాగే కిందకి దిగుతుంది. రాడార్ల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. దీని ధర రూ.695 కోట్ల నుంచి రూ.990 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో పైలట్ ఉపయోగించే హెల్మెట్ ధరే రూ.3.50 కోట్లు ఉంటుంది. వీటిని US అన్ని దేశాలకు అమ్మదు.
Similar News
News March 26, 2025
BREAKING: పంజాబ్ విజయం

గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT ప్లేయర్లు తడబడ్డారు. సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూథర్‌ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించినా చివర్లో చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో GT 20 ఓవర్లలో 232/5 స్కోరుకే పరిమితమైంది.
News March 26, 2025
రాత్రి చపాతి తింటున్నారా?

బరువు తగ్గడానికి చాలామంది రోజూ రాత్రి చపాతి తింటారు. దీని వల్ల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రుళ్లు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చపాతిలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి. దీంతో ఇంకోసారి తినాలని అనిపించదు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా చపాతీలు తినడం సరికాదు.
News March 26, 2025
సుప్రీంకు చేరిన అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద తీర్పు

పోక్సో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘వక్షోజాలు పట్టుకోవడం, పైజామా నాడా తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మహిళా సమాజంతో పాటు న్యాయ నిపుణులు మండిపడ్డారు. ఈ తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన సుప్రీం.. ఇవాళ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. రేపు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.