News August 26, 2024
బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే.. కిషన్ రెడ్డికి చోటు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాబితాలో ఉన్నారు. వీరితోపాటు కేంద్ర మంత్రులు గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, UP CM యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ CM భజన్ లాల్ శర్మ, సీనియర్ నేతలు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ ఉన్నారు.
Similar News
News September 12, 2024
రెండు రోజులు వైన్స్ బంద్
TG: గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 17 ఉ.6 గంటల నుంచి 18 సా.6 వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని పేర్కొన్నారు.
News September 12, 2024
సీతారాం ఏచూరి హైదరాబాద్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందంటే?
సీతారాం ఏచూరి బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లోనే ఆయన టెన్త్ వరకు చదివారు. 1969లో తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతం అవ్వడంతో ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన తల్లిదండ్రులు కాకినాడ వాస్తవ్యులు. అందుకే ఆయనకు హైదరాబాద్, TG, APతో అనుబంధం ఎక్కువే. ఈ కారణంతోనే ఎందరో తెలుగువారిని మార్క్సిస్టు పార్టీకి చేరువ చేశారు. జాతీయ నేతలుగా తీర్చిదిద్దారు. TG ఉద్యమంపై ఆయనకెంతో అవగాహన ఉంది.
News September 12, 2024
ఏచూరి.. చట్టసభలో సామాన్యుల గొంతుక
అనారోగ్యంతో <<14084560>>కన్నుమూసిన<<>> సీపీఎం దిగ్గజం సీతారాం ఏచూరి సుదీర్ఘకాలం రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. తొలిసారి ఆయన 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఏచూరి చట్టసభలో సామాన్యుల పక్షాన గొంతెత్తారు. ప్రభుత్వాలపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించేవారు. ప్రస్తుత కమ్యూనిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఏచూరికి దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు.