News November 29, 2024

అత్యంత పొడవైన వ్యక్తులు వీళ్లే!

image

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం చరిత్రలో అత్యంత ఎత్తైన వ్యక్తిగా అమెరికన్ రాబర్ట్ వాడ్లో (272cm) నిలిచారు. తర్వాతి స్థానాల్లో USకు చెందిన జాన్ రోగన్ (267cm) & జాన్ కారోల్ (264cm) & విల్లీ కాంపర్ (262cm)లు ఉన్నారు. అలాగే నెదర్లాండ్స్‌కు చెందిన Trijntje Keever (255 cm) అత్యంత పొడవైన మహిళగా రికార్డులకెక్కారు. ఆమె తర్వాత USకు చెందిన ఎల్లా ఇవింగ్ (254), కెనడాకు చెందిన జెంగ్ జిన్లియన్ (248) ఉన్నారు.

Similar News

News December 14, 2024

BITCOIN: ఒకరోజు లాభం Rs 1.20లక్షలు

image

క్రిప్టో మార్కెట్లు నిన్న అదరగొట్టాయి. దాదాపుగా టాప్ కాయిన్లన్నీ లాభాల పంట పండించాయి. బిట్‌కాయిన్ $1419 (Rs 1.20L) మేర పెరిగింది. $99,205 వద్ద కనిష్ఠ, $1,01,895 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి $1,01,424 వద్ద ముగిసింది. నేడు అదే స్థాయి వద్ద మొదలై $505 లాభంతో $1,01,973 వద్ద ట్రేడవుతోంది. నిన్న ETH 0.61, XRP 3.87, BNP 2.94, DOGE 1.28, ADA 1.02, AVAX 2.26, LINK 2.10, SHIB 1.93% మేర లాభపడ్డాయి.

News December 14, 2024

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈయనే..

image

TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!

News December 14, 2024

రాష్ట్రంలో మళ్లీ గజగజ..!

image

TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12, హన్మకొండలో 12.5, రామగుండంలో 13.4, నిజామాబాద్‌లో 13.9, దుండిగల్‌లో 14.8, హకీంపేట్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.