News September 6, 2024
టాప్-10 పెయిడ్ ఆటగాళ్లు వీరే.. కోహ్లీది ఎన్నో స్థానం అంటే?

వరల్డ్లోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (రూ.2,081 కోట్లు) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత జాన్ రామ్-రూ.1,712 కోట్లు, మెస్సీ-రూ.1,074 కోట్లు, లెబ్రాన్ జేమ్స్-రూ.990 కోట్లు, ఎంబాపే-రూ.881 కోట్లు, గియాన్నిస్-రూ.873 కోట్లు, నెయ్మార్-రూ.864 కోట్లు, బెంజిమా-రూ.864 కోట్లు, విరాట్ కోహ్లీ-రూ.847 కోట్లు, స్టీఫెన్ కర్రీ-రూ.831 కోట్లు గడించారు.
Similar News
News October 30, 2025
నాణ్యమైన కొబ్బరి మొక్కల ఎంపిక ఎలా?

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News October 30, 2025
ఈ ప్రకృతే భగవంతుడా?

మానవులు ప్రకృతిలో జన్మించి, ఆ ప్రకృతి ఇచ్చే అన్నం, నీరు, గాలి వంటి జడ వస్తువులతోనే ఎదుగుతున్నారు. ఈ జడ జగత్తును నడిపించే శక్తి దైవమే అని అనాదిగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కదలిక లేని దానిని చలింపజేయడానికి ఏదో ఒక చైతన్య శక్తి అవసరం. ఆ అగోచర శక్తికి ఆకారం లేకపోయినా.. అది అనంత రూపాలు, అసంఖ్యాక నేత్రాలు కలిగి ఉన్నట్లు మనం భావిస్తాం. అది పరమాత్మయే అని కీర్తిస్తాం. <<-se>>#Aushadam<<>>
News October 30, 2025
దీపారాధన, దీపదానం.. వీటి మధ్య తేడాలేంటి?

దీపారాధన అంటే మనం వెలిగించే వెలుగు. దీపదానం అంటే మనం పంచే వెలుగు. మనస్సులోని అజ్ఞానం తొలగిపోవడానికి, భగవంతుడిని ఆరాధించడానికి దేవుడి ముందు దీపాన్ని వెలిగించడాన్ని దీపారాధన అంటారు. పుణ్యం కోసం దీపాలతో పాటు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడాన్ని దీపదానం అంటారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు. ☞ ఇలాంటి ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


