News June 14, 2024
18వ లోక్‌సభలో టాప్-10 రిచెస్ట్ ఎంపీలు వీరే
☛చంద్రశేఖర్ పెమ్మసాని(TDP)- ₹5,705 కోట్లు
☛కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP) – ₹4,568 కోట్లు
☛నవీన్ జిందాల్(BJP) – ₹1,241 కోట్లు
☛ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి (TDP) ₹716 కోట్లు,
☛సీఎం రమేశ్(BJP)- ₹497 కోట్లు
☛జ్యోతిరాదిత్య సింధియా(BJP)- ₹424 కోట్లు
☛ఛత్రపతి సాహు మహరాజ్(INC)- ₹342 కోట్లు
☛శ్రీభరత్ (TDP) – ₹298 కోట్లు
☛హేమ మాలిని (BJP)- ₹278 కోట్లు
☛ప్రభ మల్లికార్జున్ (INC)- ₹241 కోట్లు
Similar News
News September 17, 2024
స్త్రీ ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి: నటి ఖుష్బూ
మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె స్పందించారు. ‘స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా భావించొద్దు. ఆమె ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి. మహిళల్ని వేధించేవారు, అసభ్యంగా మాట్లాడేవారు ఆమె నేర్పే పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఆమె గురించి ఒక్క మాట మాట్లాడాలన్న వణుకుతారు’ అని వ్యాఖ్యానించారు.
News September 17, 2024
రేవంత్ ధర్మం తెలిసినవాడు: రాజాసింగ్
TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. ‘పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం. రేవంత్ ధర్మం తెలిసినవాడు’ అని వ్యాఖ్యానించారు.
News September 17, 2024
చైనాకు మద్దతు తెలిపిన పాక్ ఆటగాళ్లు
ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో చైనాకు పాక్ ఆటగాళ్లు మద్దతు తెలిపారు. పాక్ ఎవరి చేతిలో సెమీస్‌లో ఓటమిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గమనార్హం. మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చైనా జెండాలను చేతబట్టుకొని కనిపించారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఎవరికి మద్దతు ఇస్తున్నది స్పష్టం అవుతోందంటూ కామెంటేటర్ వ్యాఖ్యానించారు. ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.