News April 30, 2024
MIMపై ఓడిన ఉద్దండులు వీరే!

TG: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తొలి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదిక. ఇక్కడ 1984 నుంచి ఎంఐఎం పార్టీనే గెలుస్తూ వస్తోంది. సలావుద్దీన్ ఒవైసీ, ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీలే ఎంపీలుగా కొనసాగుతూ వచ్చారు. వీరిపై వి.హనుమంతరావు, ప్రభాకర్ రెడ్డి, పి.ఇంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వెంకయ్యనాయుడు, బద్దం బాల్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జాహెద్ అలీ ఖాన్ వంటి హేమాహేమీలు పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News March 17, 2026
IPL తొలి మ్యాచులకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్‌వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.
News March 17, 2026
తిరుమలలో గ్యాస్ కొరత.. పలు దుకాణాలు మూసివేత!

AP: తిరుమలలో గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పలు టీ షాప్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేశారు. సిలిండర్ల కోసం గోడౌన్ వద్ద బారులు తీరారు. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది.
News March 17, 2026
ఆధారాలివిగో.. KTR రాజీనామా చెయ్: సీతక్క

TG: మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹57000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న KTR <<19406367>>సవాల్‌పై<<>> మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేస్తూ… సవాల్‌కు కట్టుబడి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ₹57000 కోట్లు రుణాలివ్వడమే కాకుండా వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇప్పటివరకు ₹1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని వివరించారు.


