News March 16, 2024
పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే YCP అభ్యర్థులు వీరే..
కొద్దిసేపటి క్రితం ప్రకటించిన YCP MLA అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి)కు పోటీగా లావణ్య, బాలకృష్ణ (హిందూపురం)కు TN దీపిక పోటీ ఇస్తారని YCP ప్రకటించింది.
Similar News
News October 11, 2024
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్
AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
News October 11, 2024
ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం
ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.
News October 11, 2024
యువకుడి కడుపులో ప్రాణాలతో బొద్దింక.. వైద్యులు ఏం చేశారంటే?
ఢిల్లీ డాక్టర్లు ఓ యువకుడి కడుపులో బతికి ఉన్న బొద్దింకను ఎండోస్కోపి ద్వారా తొలగించారు. గత కొంత కాలంగా యువకుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు చిన్న పేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.