News August 25, 2024

ఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్

image

TG: ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపై ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈ కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు. భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులను అందించాలనేది లక్ష్యం. కొందరు శ్రీమంతులు చెరువుల్లో ఫాంహౌస్‌లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను గండిపేటలో కలిపారు. వాళ్ల విలాసం కోసం వ్యర్థాలు చెరువులో కలుపుతారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News November 15, 2025

తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

image

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకొని హీరో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా తండ్రితో కలిసి చేసిన మూవీలో ఓ స్టిల్‌ను షేర్ చేసుకున్నారు. ‘ఇవాళ మిమ్మల్ని కాస్త ఎక్కువగానే మిస్ అవుతున్నాను. నాన్నా మీరు ఉండి ఉంటే గర్వపడేవారు’ అని ట్వీట్ చేశారు. ఇది చూసి మహేశ్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ‘ఆయన్ను మీరు ఎప్పుడో గర్వపడేలా చేశారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

News November 15, 2025

CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?

image

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్నకు సమాధానంగానే సంజూను జట్టులోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి రుతురాజ్‌కు ఆ బాధ్యతలిచ్చారు. మళ్లీ MSDనే కెప్టెన్ చేశారు. అయితే ఈ సమస్యకు సంజూనే శాశ్వత పరిష్కారమని విశ్లేషకులూ భావిస్తున్నారు. అటు జట్టు భవిష్యత్తు కోసం జడేజానూ CSK త్యాగం చేసిందంటున్నారు.

News November 15, 2025

అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

image

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>