News August 14, 2024
సుప్రీం తీర్పుతో ఈ షేర్లు ఢమాల్
<<13849728>>రాయల్టీ బకాయిలను<<>> రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్, మెటల్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. టాటా స్టీల్, NMDC, వేదాంత, హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా షేర్లు ఇంట్రాడేలో 5% మేర పతనమయ్యాయి. కొన్ని షేర్లు 3% నష్టాల్లో, మరికొన్ని ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఈ తీర్పుతో కేవలం PSUలే రూ.70వేల కోట్ల మేర చెల్లించాల్సి వస్తుందని అంచనా. మెటల్, సిమెంట్ కంపెనీల పైనా ప్రభావం ఉండనుంది.
Similar News
News September 15, 2024
వరదలపై అసత్య ప్రచారం వైసీపీ కుట్ర: మంత్రి నారాయణ
AP: విజయవాడలో మళ్లీ వరదలు వస్తున్నాయని జరిగిన ప్రచారం వెనుక వైసీపీ కుట్ర ఉందని మంత్రి నారాయణ ఆరోపించారు. వరదలపై అసత్య పోస్టుల గురించి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో పరిస్థితి మెరుగైందని అన్నారు. అగ్నిమాపక శకటాలతో ఇళ్లు శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
News September 15, 2024
ముగ్గురు ఐపీఎస్లకు ప్రభుత్వం షాక్
AP: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించారని వీరిపై ఆరోపణలున్నాయి.
News September 15, 2024
ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదు?: బీజేపీ
ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ 48 గంటల్లో కాకుండా ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదని బీజేపీ ప్రశ్నించింది. ఆప్ చీఫ్ ఎందుకీ డ్రామా క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టింది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనే ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొంది. రోడ్లపై కేజ్రీవాల్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను సరైన స్థానంలో ఉంచారని విమర్శించింది. మరోవైపు సీఎం రాజీనామా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.