News September 22, 2024
గిన్నిస్ రికార్డ్స్‌లో ఈ టాలీవుడ్ ప్రముఖులూ..
తన డాన్సులకు గాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ ఘనత సాధించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు, అత్యధిక చిత్రాల దర్శకుడిగా దాసరి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా విజయనిర్మల, బతికున్న వారిలో అత్యధిక చిత్రాల్లో నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం, అత్యధిక పాటలు పాడినవారిగా SPB, సుశీల చరిత్రకెక్కారు.
Similar News
News October 6, 2024
చెన్నైలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 100 మంది స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
News October 6, 2024
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను షాకు అందించనున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే హోంమంత్రుల సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
News October 6, 2024
కాసేపట్లో వర్షం
తెలంగాణలోని 8 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాన పడింది.