News July 4, 2024

ఈ రెండు పరేడ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే..!

image

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. లక్షలాదిగా తరలిరావడంతో ముంబై వీధులు సముద్రాన్ని తలపించాయి. ఇంతటి ప్రజాదరణ 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు బ్యూనస్ ఎయిర్స్‌లో లభించింది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ రెండు పరేడ్స్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు అంటున్నారు.

Similar News

News December 7, 2025

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏం చేస్తారంటే?

image

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ రేపు, ఎల్లుండి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. రెండు రోజులు వివిధ రకాల సదస్సులు నిర్వహిస్తారు. వీటిలో మంత్రులు, IAS అధికారులు, ఆయా రంగాల నిపుణులు పాల్గొననున్నారు. హెల్త్ కేర్, సెమీ కండక్టర్లు, ఎడ్యుకేషన్, గిగ్ ఎకానమీ, స్పేస్ అండ్ డిఫెన్స్, టూరిజం ఇలా 27 అంశాలపై చర్చిస్తారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా.

News December 7, 2025

రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ

image

AP: బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. రైతుబజార్లను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లను <>digirythubazaarap.com<<>> సైట్ ద్వారా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తుంది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే మిగతా రైతుబజార్లకూ విస్తరించనుంది.

News December 7, 2025

శని దోషాలు ఎన్ని రకాలు?

image

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.