News July 3, 2024
అవన్నీ తప్పుడు ప్రచారాలే: టీటీడీ

AP: అన్న ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేయాలని TTD భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని దేవస్థానం ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ‘స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి ఈవో శ్యామలరావు సుదీర్ఘంగా చర్చించిన మాట వాస్తవం. అయితే వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పుడు వార్తల్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది.
Similar News
News November 24, 2025
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. 167 జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.


