News November 28, 2024
అవి కేంద్ర ప్రభుత్వ డ్రామాలు: చంద్రశేఖర్ ఆజాద్
సంభల్‌లో అల్లర్లు, జ్ఞానవాపీ వివాదం, ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ దర్గా అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలని MP చంద్రశేఖర్ ఆజాద్ మండిపడ్డారు. ఇదంతా నిరుద్యోగం, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమన్నారు. ఇలాంటి వివాదాలను లేవనెత్తడం ద్వారా ఆహార సమస్యలు, విద్యా, ఆరోగ్యం, మహిళా భద్రత వంటి కీలక అంశాలపై ఎవరూ ప్రశ్నించరని కేంద్రం భావిస్తోందని విమర్శించారు.
Similar News
News December 5, 2024
IND vs AUS: రెండో టెస్టుకు వరుణుడి గండం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.
News December 5, 2024
నేడు ప్రోబా-3 ప్రయోగం
AP: శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సా.4.12 గంటలకు PSLV C59 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.
News December 5, 2024
EWS కోటాలో కాపులకు సగం సరికాదు: హైకోర్టు
AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.