News May 24, 2024

డెత్ ఓవర్లలో డేంజరస్ బ్యాటర్లు వీరే

image

IPLలో 2018 నుంచి ఇప్పటి వరకు డెత్ ఓవర్ల(17-20)లో అత్యధిక స్ట్రైక్ రేటు(212.22)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రస్సెల్ నిలిచారు. అతను 62 సిక్సులు, 81 ఫోర్లతో 868 పరుగులు చేశారు. ఆ తర్వాత రిషభ్ పంత్(206.66SR), హెట్‌మెయిర్(197.67SR), దినేశ్ కార్తీక్(195.77SR), కేఎల్ రాహుల్(190.53SR) ఉన్నారు. అయితే అత్యధిక పరుగులు(1,020), సిక్సులు(65), ఫోర్లు(90) సాధించిన ప్లేయర్‌గా డీకే ఘనత సాధించారు.

Similar News

News February 8, 2025

మేజిక్ ఫిగర్ దక్కేదెవరికో?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలున్న దేశ రాజధానిలో అధికారం చేపట్టాలంటే 36 స్థానాలు గెలుచుకోవాలి. తాము 50 సీట్లతో విజయఢంకా మోగించబోతున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా మూడోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత తేలిపోయింది. ఈ సారి కనీసం పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతోంది.

News February 8, 2025

టెన్త్ ప్రశ్నపత్రాలపై QR కోడ్

image

TG: టెన్త్ క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్లను విద్యాశాఖ ముద్రించనుందని సమాచారం. ఎక్కడైనా లీకైతే అవి ఏ సెంటర్ నుంచి బయటికి వచ్చాయో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. APలో గత ఏడాదే ఈ విధానం అమలు చేశారు. కాగా ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల కాగానే విద్యార్థుల మొబైల్‌కు మెసేజ్ పంపేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే హాల్‌టికెట్ రానుంది.

News February 8, 2025

ముచ్చటగా మూడోసారా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో అక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. రాజధానిలో గడచిన 2సార్లూ ఆప్‌దే అధికారం. ముచ్చటగా మూడోసారీ గెలిచి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తుంటే.. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీని ఈసారి చేజిక్కించుకుంటామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గు చూపుతున్నాయి. మరి ఢిల్లీ ఓటరు మనోగతం ఎలా ఉందో నేటి సాయంత్రం లోపు తేలనుంది.

error: Content is protected !!