News March 3, 2025
పుతిన్ కంటే వారే ప్రమాదం: ట్రంప్

అమెరికాకు పుతిన్ కంటే అక్రమ వలసలని నిరోధించటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు. హంతకులు, డ్రగ్స్మాఫియా, రేపిస్టులను దేశంలోనికి రాకుండా నిరోధించటం వల్ల తమ దేశం యూరప్లా మారకుండా ఉంటుందన్నారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు భారీగా తగ్గించామని ‘అమెరికాపై దండయాత్ర ముగిసిందని’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్ ప్రభుత్వంలో నెలకు 3లక్షలకు పైగా అక్రమ వలసదారులు దేశంలో ప్రవేశించేవారని అన్నారు.
Similar News
News March 3, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11గంటల పాటు సాగింది.
News March 3, 2025
రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘నెల రోజుల శాంతి’కి యోచన: ఫ్రాన్స్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నెలరోజుల విరామం ఇచ్చి శాంతిని పాటించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు. లండన్లో ఐరోపా దేశాల అధినేతలు ఇటీవల భేటీ అయ్యారు. బ్రిటన్ కూడా శాంతి ఒప్పందం యోచనకే మొగ్గు చూపుతోందని ఆయన పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు శాంతికి కట్టుబడి ఉంటారో లేదో దీనితో తేలుతుంది. ఆ తర్వాతే అసలైన శాంతి చర్చలు ప్రారంభమవుతాయి’ అని తేల్చిచెప్పారు.
News March 3, 2025
నాని ‘ది ప్యారడైజ్’పై విమర్శలు

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న ‘ది ప్యారడైజ్’ మూవీ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. అందులో వాడిన పదజాలం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. బూతు పదాన్ని, అందునా తల్లిని కించపరిచే పదాన్ని వాడటమేంటంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తుండగా, సినిమా కథ దృష్ట్యా ఈ పదం వాడి ఉండొచ్చని, మూవీ రిలీజయ్యే వరకూ విమర్శించడం సరికాదని నాని అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ వాదనపై మీ అభిప్రాయం?