News November 7, 2024

పీఎం విద్యాలక్ష్మి స్కీమ్‌కు వీరు అనర్హులు

image

ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు కేంద్రం <<14544821>>పీఎం విద్యాలక్ష్మి<<>> పథకాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7.5 లక్షల లోపు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. రూ.10 లక్షల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికే స్కీమ్ వర్తిస్తుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, వడ్డీ రాయితీ పథకాలు పొందుతున్న వారు అనర్హులు.

Similar News

News December 12, 2024

వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్, ఫేస్ బుక్ డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సర్వర్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్, ఫేస్‌బుక్ డౌన్ అయినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెసేజ్‌లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి వాట్సాప్‌లో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. మీ ఫోన్లలోనూ ఇలాగే సర్వర్ డౌన్ ఇష్యూ వచ్చిందా COMMENT చేయండి.

News December 12, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 12, గురువారం
ద్వాదశి: రా.10.26 గంటలకు
అశ్వని: ఉ.9.52 గంటలకు
వర్జ్యం: 1) ఉ.7.39 గంటలకు
2) సా.6.39- 8.07గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10-10.54 గంటల వరకు
2) మ.2.37- 3.21గంటల వరకు

News December 12, 2024

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు.. రేపు లాటరీ

image

AP: అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ లెనిన్ సెంటర్‌లోని కార్యాలయంలో డిసెంబర్ 12న లాటరీ తీయనున్నట్లు CRDA కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సూచించారు.