News April 2, 2024

వాళ్లు అసలు మనుషులే కాదు: వాట్సన్

image

ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషభ్ పంత్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్. పంత్‌ నుంచి కూడా ప్రేరణ పొందనివారు అసలు మనుషులే కాదని అభిప్రాయపడ్డారు. ‘ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషభ్ తిరిగి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం నమ్మశక్యంగా లేదు. దారిలో పడేందుకు కొంచెం సమయం తీసుకున్నారు కానీ సెట్ అయ్యాక తనదైన స్టైల్‌లో అద్భుతమైన షాట్లు ఆడారు’ అని వాట్సన్ పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

ఇస్లామాబాద్‌లో దాడి చేసింది మేమే: ఐసిస్

image

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్‌ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

News February 7, 2026

ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.

News February 7, 2026

రోహిత్, కోహ్లీని డిమోట్ చేసిన బీసీసీఐ!

image

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిని గ్రూప్-Bకి డిమోట్ చేసినట్లు సమాచారం. A+ కేటగిరీని బోర్డు తొలగించిందని NDTV పేర్కొంది. గ్రూప్ Aలో గిల్, బుమ్రా, జడేజాకు చోటు కల్పించిందని తెలిపింది. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.