News April 18, 2024
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మాధవీ లత
శ్రీరామ నవమి శోభాయాత్రలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈక్రమంలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నాపై నెగటివిటీని సృష్టించేందుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది అసంపూర్ణమైన వీడియో అని స్పష్టం చేస్తున్నా. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారికి క్షమాపణలు చెప్తున్నా’ అని తెలిపారు.
Similar News
News November 18, 2024
మణిపుర్ మంటలు: మరోసారి అమిత్ షా హైలెవల్ మీటింగ్
మణిపుర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హై లెవల్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఆదివారం సైతం ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆయన సమీక్షించడం గమనార్హం. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్లు దాడులు చేయడంతో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం అదనంగా 50 కంపెనీల సాయుధ బలగాలను అక్కడికి తరలించింది. ఇప్పటికే మోహరించిన వాటితో కలిపి ఈ సంఖ్య 70కి చేరింది.
News November 18, 2024
లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
News November 18, 2024
బుల్డోజర్ సిద్ధంగా ఉంది: యోగి
‘బుల్డోజర్ న్యాయం’ సరికాదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే UP CM యోగి మళ్లీ అలాంటి కామెంట్స్ చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘సోరెన్ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టింది. వాటిని రికవరీ చేయడానికి బుల్డోజర్ సిద్ధంగా ఉంది. బంగ్లా వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను సర్కారు ప్రోత్సహిస్తోంది. వీరి వల్ల బేటీ, మటీ, రోటీ(కూతురు, భూమి, రొట్టె)కి ముప్పు ఏర్పడింది’ అని చెప్పారు.