News March 30, 2024

పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు: కోమటిరెడ్డి

image

TG: కాంగ్రెస్‌లో తాను ఏక్‌నాథ్ షిండే అవుతానంటూ BJP MLA మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు. ‘నాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని ఆయనే అడిగారు. మాకు మెజార్టీ ఉంది కాబట్టి అవసరం లేదని చెప్పా. పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు. అమిత్ షా, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు’ అని మండిపడ్డారు.

Similar News

News April 17, 2026

మహిళా బిల్లుకు గతంలోనే మద్దతిచ్చాం: CBN

image

AP: ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు పలుకుతున్నామని CM చంద్రబాబు TDP ఆఫీసులో మీడియాతో పేర్కొన్నారు. ‘గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాం. కొన్ని కారణాలతో అప్పుడది కార్యరూపం దాల్చలేదు’ అని వివరించారు. ఈసారైనా బిల్లు నెగ్గి అమలవుతుందా? అని మీడియా ప్రశ్నించగా ‘మహిళా బిల్లు ఆమోదం పొందితే మీరు వంటింట్లో పని చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా’ అని CBN వ్యాఖ్యానించారు.

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

image

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.

News April 17, 2026

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.