News September 16, 2024

అధ్యక్షులుగా ఉండగానే హత్యకు గురైంది వీరే..!

image

US మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రముఖుల భద్రతపై చర్చ జరుగుతోంది. ఆ దేశ చరిత్రలో ఏకంగా నలుగురు అధ్యక్షులు- అబ్రహాం లింకన్(1865), జేమ్స్ గార్ఫీల్డ్(1881), విలియం మెకిన్లే(1901), జాన్ ఎఫ్ కెన్నెడీ(1963) హత్యకు గురయ్యారు. మరో నలుగురు రూజ్‌వెల్ట్(1912), గెరాల్డ్ ఫోర్డ్ (1975), రొనాల్డ్ రీగన్(1981), ట్రంప్(2024)(అధ్యక్ష అభ్యర్థి) హత్యాయత్నం నుంచి బయటపడ్డారు.

Similar News

News November 8, 2025

రేవంత్, కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

image

TG: రాష్ట్రంలో <<18226951>>బ్యాడ్ బ్రదర్స్<<>> అంటే రేవంత్, KCR అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తాను తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చిందో డాక్యుమెంట్లతో సహా వివరిస్తానని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ‘రేవంత్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వం. బ్యాడ్ బ్రదర్స్ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు’ అని వ్యాఖ్యానించారు.

News November 8, 2025

ఆముదం పంటలో రసం పీల్చే పురుగుల నివారణ

image

యాసంగిలో ఆముదం పంటను రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఆకుల నుంచి రసం పీల్చడంతో ఆకుల కొనలు పసుపు వర్ణంలోకి మారి, మాడిపోతాయి. ఈ పురుగుల ఉద్ధృతి నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు పురుగుల ఉద్ధృతిని బట్టి లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News November 8, 2025

ఒలింపిక్స్‌కు క్రికెట్ జట్ల ఎంపిక ఇలా..

image

LA-2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్ జట్ల ఎంపికను ICC పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఖండాలవారీగా ర్యాంకింగ్‌లోని టాప్‌ జట్లు ఆడనున్నాయి. IND(ఆసియా), SA(ఆఫ్రికా), ENG(యూరప్), AUS(ఓషియానియా), ఆతిథ్య జట్టుగా USA/WI ఎంపికవుతాయి. ఆరవ జట్టుగా గ్లోబల్ క్వాలిఫయర్‌ ఎంపిక బాధ్యత అమెరికాపై ఉండనుంది. ఈ విధానం వల్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న జట్టుకూ అవకాశం దక్కకపోవచ్చు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.