News November 12, 2024
AP అసెంబ్లీ, మండలిలో విప్‌లు వీరే
☛ అసెంబ్లీ విప్‌లు: ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్, బి.అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నారాయణ నాయకర్, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, దివ్య యనమల, థామస్. జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్పగారి, PGVR నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్ రావు.
☛ మండలిలో విప్‌లు: చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, హరిప్రసాద్.
☛ <<14594795>>అసెంబ్లీ చీఫ్ విప్‌గా<<>> ఆంజనేయులు, మండలి చీఫ్ విప్‌గా అనురాధ నియామకం.
Similar News
News December 3, 2024
మార్చి 15 నుంచి ‘టెన్త్’ పరీక్షలు?
AP: వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్‌లో రూపొందించారు. సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించారు.
News December 3, 2024
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ఈ నెల 22న వీరి వివాహం ఉదయ్‌పుర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అనంతరం 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తారు. కాగా వరుడు సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. త్వరలో వీరి వివాహ పనులు ప్రారంభమవుతాయి.
News December 3, 2024
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున కాసేపు వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో వైపు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. చలి తీవ్రత బాగా తగ్గింది.