News January 9, 2025

నన్ను జైలులో పెట్టాలని చూస్తున్నారు: KTR

image

TG: తనను జైలులో పెట్టించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని KTR ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను జైలులో పెట్టించాలని చూస్తే, అది రేవంత్ కర్మ. ఏసీబీ అధికారులు 80కి పైగా ప్రశ్నలు అడిగారు. అడిగినవే మళ్లీమళ్లీ అడిగారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సీఎంను అడిగా. లైవ్‌లో చర్చిద్దామని చెప్పా. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంట్లో అయినా నేను సిద్ధమే’ అని సవాల్ విసిరారు.

Similar News

News January 10, 2025

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

image

దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు 3కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారు. అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. పవిత్రమైన ఈరోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

News January 10, 2025

భార్యాభర్తలూ.. పిల్లల ముందు ఈ పనులు వద్దు

image

ఐదేళ్ల లోపు చిన్నారులు మనం మాట్లాడే మాటలు, చేసే పనులను చూసి చాలా నేర్చుకుంటారు. అందుకే వారి ముందు ఆర్థిక సమస్యల గురించి చర్చించుకోకండి. వారికేం అర్థమవుతుందిలే అనుకోవద్దు. అలాగే గట్టిగా అరుచుకుంటూ గొడవ పడకండి. అది వారి మానసిక ఆరోగ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. వారూ అలానే అరిచే అవకాశం ఉంటుంది. ఇక పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే పెద్దవాళ్ల పట్ల గౌరవం చూపకుండా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది.

News January 10, 2025

ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన

image

మాజీ PM ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు.