News March 7, 2025
సైకో అంటారు.. మేం తిరిగి అంటే ఏడుస్తారు: తాటిపర్తి

AP: కూటమి నేతలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైరయ్యారు. ‘జగన్ను మీరు సైకో, శాడిస్ట్, క్రిమినల్, ఉగ్రవాది, తీవ్రవాది అనొచ్చు.. మిమ్మల్ని కార్పొరేటర్కు ఎక్కువ అంటే ఏడుస్తారు. తిరిగి బూతులు తిడతారు. ఇదేం చోద్యం?’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్ సెటైర్ వేయడంతో కూటమి నేతలు రగిలిపోతున్న విషయం తెలిసిందే.
Similar News
News March 9, 2025
అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
News March 9, 2025
APలో మరో 2 ఎయిర్పోర్టులు?

AP: అమరావతి, శ్రీకాకుళంలో 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించింది. శ్రీకాకుళం నగరానికి 70కి.మీ దూరంలో సముద్ర తీరానికి సమీపంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదిస్తోంది. అటు రాజధానిలో ఎక్కడ నిర్మించాలనేది కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని ప్రభుత్వం పేర్కొంది.
News March 9, 2025
చిరంజీవి, పవన్ వద్ద అప్పు తీసుకున్న నాగబాబు

AP: కూటమి MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37Cr, బ్యాంకులో నిల్వ రూ.23.53L, చేతిలో నగదు రూ.21.81L, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08Cr, బెంజ్ కారు, 950 గ్రా. బంగారం, 55 క్యారెట్ల వజ్రాలు, 20 KGల వెండి ఉంది. మొత్తం రూ.59Cr చరాస్తులు, రూ.11Cr స్థిరాస్తులు ఉన్నాయి. చిరంజీవి వద్ద రూ.28L, పవన్ వద్ద రూ.6L అప్పు తీసుకున్నారు.