News March 7, 2025
సైకో అంటారు.. మేం తిరిగి అంటే ఏడుస్తారు: తాటిపర్తి

AP: కూటమి నేతలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైరయ్యారు. ‘జగన్‌ను మీరు సైకో, శాడిస్ట్, క్రిమినల్, ఉగ్రవాది, తీవ్రవాది అనొచ్చు.. మిమ్మల్ని కార్పొరేటర్‌కు ఎక్కువ అంటే ఏడుస్తారు. తిరిగి బూతులు తిడతారు. ఇదేం చోద్యం?’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్ సెటైర్ వేయడంతో కూటమి నేతలు రగిలిపోతున్న విషయం తెలిసిందే.
Similar News
News March 6, 2026
రక్త పరీక్షతో అల్జీమర్స్‌ను ముందే గుర్తించొచ్చు: వైద్యులు

ప్రస్తుతం చాలా మంది బాధపడే అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధిని రక్త పరీక్ష ద్వారా ముందే గుర్తించవచ్చని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. ‘అల్జీమర్స్ లక్షణాలు కనిపించడానికి 20 ఏళ్ల ముందే మెదడులో మార్పులు మొదలవుతాయి. వీటిని గుర్తించేందుకు రక్తంలోని ‘p-tau217’ ప్రొటీన్ ద్వారా వ్యాధి ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో ముందే అంచనా వేయవచ్చు. ఇది వ్యాధి ముదరకముందే చికిత్స అందించడానికి తోడ్పడుతుంది’ అని సూచిస్తున్నారు.
News March 6, 2026
మిస్సైల్స్ అటాక్స్‌కు అవకాశం.. ప్రజలకు మెసేజ్‌లు

యుద్ధంతో గల్ఫ్ కంట్రీ దుబాయ్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మిస్సైళ్ల దాడులకు అవకాశం ఉందంటూ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవాళ్లు వెంటనే స్థానికంగా షెల్టర్లు తీసుకోవాలని ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసింది.
News March 6, 2026
సివిల్స్ ఫలితాలు విడుదల

సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి ర్యాంకుల్లో వరుసగా రాజేశ్వరి సువే, ఆకాన్ష్, రాఘవ్, ఇషాన్ భట్నాగర్ ఉన్నారు. మొత్తంగా 1,087 పోస్టులకు పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈసారి IASకు 180, IFSకు 55, IPSకు 150, గ్రూప్-A సెంట్రల్ సర్వీసెస్‌కు 507, గ్రూప్-B సర్వీసెస్‌కు 195 మంది ఎంపికయ్యారు.


