News August 21, 2024
సిగ్గు లేకుండా మమ్మల్ని అంటున్నారు: భట్టి
TG: ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని BRS నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన లేకుండా విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 15, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్లా నుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎదుటివారు తప్పులను లెక్కించేవారు చాలా మంది ఉంటారు. తమ తప్పులను తెలుసునేవారు కొందరే ఉంటారు. ఇతరుల తప్పులను గుర్తించేవారు తమ తప్పులను తెలుసుకోలేరు.
News September 15, 2024
విమాన ఆలస్యంపై షమీ పోస్ట్.. సోనూ సూద్ ఫన్నీ రిప్లై
తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైందంటూ క్రికెటర్ షమీ చేసిన పోస్టుకు యాక్టర్ సోనూ సూద్ సరదాగా స్పందించారు. ‘మళ్లీ నా ఫ్లైట్ ఆలస్యమైంది. ఎయిర్‌పోర్టు నాకు టెంపరరీ ఇల్లుగా మారిపోయింది’ అంటూ బాధగా ఉన్న ఫొటోలను షమీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఏమైందంటూ పలువురు కామెంట్స్ చేశారు. వీటికి సోనూ రిప్లై ఇస్తూ ‘భయ్యా.. ఎవరూ టెన్షన్ పడొద్దు. ఆయన ఇంట్లో పడుకున్నట్లే అక్కడా నిద్రపోతారు’ అని రాసుకొచ్చారు.
News September 15, 2024
సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు
1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం
1892: పద్మభూషణ్ గ్రహీత, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
జాతీయ ఇంజనీర్ల దినోత్సవము
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం