News November 19, 2024
ఆఖరి 40 నిమిషాల్లో కూల్చేశారు

దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి 40 నిమిషాల్లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. అంతకుముందు ఉదయం సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో దూసుకుపోయాయి. అయితే, చివర్లో అనూహ్యంగా పెరిగిన అమ్మకాలతో సెన్సెక్స్ కేవలం 239 పాయింట్ల లాభంతో 77,578 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 వద్ద స్థిరపడ్డాయి.
Similar News
News December 7, 2025
2,757 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BA, B.com, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు DEC18 వరకు NAPS/NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 7, 2025
ఏపీలో 13, తెలంగాణలో 21న లోక్ అదాలత్

TG: వివాదాలు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వెల్లడించింది. సివిల్, చెక్ బౌన్స్, వివాహ సంబంధ వివాదాలు, రాజీపడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ట్రాఫిక్ చలాన్ల సెటిల్మెంట్ ఉండదని స్పష్టం చేశారు. అటు ఏపీలో ఈ నెల 13న లోక్ అదాలత్ జరగనుంది.
News December 7, 2025
BDLలో 156 పోస్టులు… అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<


