News December 31, 2024
ద్రాక్ష రుచిని బట్టి నెల ఎలా ఉంటుందో చెప్తారు!

కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ప్రజలు కోరుకుంటుంటారు. స్పెయిన్, మెక్సికో ప్రజలు వినూత్నంగా న్యూ ఇయర్ జరుపుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్షలను తినే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. ద్రాక్ష టేస్టును బట్టి ఏడాదిలో ఏ నెల ఎలా ఉంటుందో ముందే గుర్తిస్తారు. ద్రాక్ష రుచికరంగా ఉంటే అదృష్టం & శ్రేయస్సు సొంతమన్నట్లు. ద్రాక్ష పుల్లగా ఉంటే ఆ నెలంతా కఠినంగా ఉంటుందని అర్థం. మీ ప్రాంతంలో ఇలాంటివేవైనా ఉన్నాయా?
Similar News
News November 24, 2025
MHBD ఎంప్లాయిమెంట్స్ కార్యాలయంలో జాబ్ మేళా

మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో, క్రెడిట్ ఆక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, కంపెనీలో కేంద్ర మేనేజర్ ఉద్యోగాల ఎంపికకై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రజిత తెలిపారు. అర్హత కల్గిన నిరుద్యోగ అభ్యర్థులు ఈనెల 26న ఉదయం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆమె కోరారు.
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఫైరయ్యారు. రెండో టెస్టులో సుందర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం సరికాదన్నారు. ఈ ఆలోచన అర్థం లేనిదని మండిపడ్డారు. కోల్‌కతా(తొలి) టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒకరికి ఒకే ఓవర్ ఇవ్వడమూ సరైన నిర్ణయం కాదన్నారు. కనీసం స్పెషలిస్టు బ్యాటర్‌తో వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.


