News December 31, 2024

ద్రాక్ష రుచిని బట్టి నెల ఎలా ఉంటుందో చెప్తారు!

image

కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ప్రజలు కోరుకుంటుంటారు. స్పెయిన్‌, మెక్సికో ప్రజలు వినూత్నంగా న్యూ ఇయర్ జరుపుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్షలను తినే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. ద్రాక్ష టేస్టును బట్టి ఏడాదిలో ఏ నెల ఎలా ఉంటుందో ముందే గుర్తిస్తారు. ద్రాక్ష రుచికరంగా ఉంటే అదృష్టం & శ్రేయస్సు సొంతమన్నట్లు. ద్రాక్ష పుల్లగా ఉంటే ఆ నెలంతా కఠినంగా ఉంటుందని అర్థం. మీ ప్రాంతంలో ఇలాంటివేవైనా ఉన్నాయా?

Similar News

News July 8, 2025

ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

image

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్‌కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.

News July 8, 2025

లండన్‌లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్‌లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్‌లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్‌లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.