News September 16, 2024

90ల్లో ఎక్కువసార్లు ఔటైంది వీరే

image

వన్డే క్రికెట్‌లో 90ల్లో ఎక్కువగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఔటయ్యారు. 17 సార్లు ఆయన 90ల్లో ఔటై త్రుటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. సచిన్ తర్వాత అరవింద డిసిల్వా (7), గ్రాంట్ ఫ్లవర్ (7), నాథన్ అస్టల్ (7), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (6), సనత్ జయసూర్య (6), సౌరవ్ గంగూలీ (6), విలియమ్సన్ (6), శిఖర్ ధవన్ (6), విరాట్ కోహ్లీ (5), వీరేంద్ర సెహ్వాగ్ (5), రోహిత్ శర్మ 4 సార్లు 90ల్లో పెవిలియన్ చేరారు.

Similar News

News October 16, 2024

త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు?

image

AP: మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా నేటి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.

News October 16, 2024

నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు

image

మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.

News October 16, 2024

నేడు క్యాబినెట్ భేటీ.. కొత్త పాలసీలపై చర్చ

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదారు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి, ఆమోదించే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు10% ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నారు.