News October 7, 2024

ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Similar News

News March 30, 2026

రేపు మాంసం దుకాణాలు బంద్

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల రేపు మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా నాన్ వెజ్ షాపులు మూసేస్తున్నారు. GHMC పరిధిలోని కబేళాలు, మటన్ దుకాణాలు మంగళవారం మూసేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

News March 30, 2026

ఆ టైమ్‌లో చనిపోవాలనుకున్నా: నటి హేమ

image

డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా కలచివేశాయని నటి హేమ చెప్పారు. ‘ఆ సమయంలో చనిపోవాలనిపించింది. మానసికంగా కుంగిపోయా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే చివరికి నిర్దోషిగా బయటికి వచ్చా. మీడియాలో వచ్చిన కొన్ని వార్తల వల్ల నా కుటుంబం చాలా సఫర్ అయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆమె పాల్గొన్నారు.

News March 30, 2026

ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ.. ఎంతంటే?

image

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 95 క్రాస్ అయింది. ప్రస్తుతం ఒక $ విలువ ₹95.12గా ఉంది. సెన్సెక్స్ 1750 పాయింట్ల నష్టంతో 71,832 వద్ద, నిఫ్టీ 515 పాయింట్లు నష్టపోయి 22,304 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లు కుప్పకూలాయి.