News November 19, 2024
రేపటి నుంచి Bank Niftyలో అవి కనిపించవు

రేపటి నుంచి Bank Niftyలో వీక్లీ డెరివేటివ్స్ కనిపించవు. ఈ ఇండెక్స్ Volatilityపై అవగాహన లేని రిటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఇక నుంచి ఒక ఇండెక్స్‌లోనే వీక్లీ డెరివేటివ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎక్స్‌ఛేంజ్‌లను SEBI ఆదేశించింది. దీంతో Nifty వీక్లీ F&Oను అలాగే ఉంచి Bank Nifty వీక్లీ ఆప్షన్స్‌ను తొలగించాలని NSE నిర్ణయించింది. ఈ ఇండెక్స్‌లో Monthly Derivatives మాత్రమే ఉంటాయి.
Similar News
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.
News February 12, 2026
నేటి సామెత: కొబ్బరి చెట్లకు కుడితిమిత్తి

కొబ్బరి మొక్కకు వృథాగా పారబోసే కుడితిని నీరుగా పోసి పెంచితే, అది పెద్దయ్యాక మనకు ఎన్నో కాయలను అందించి ఆ రుణాన్ని తీర్చుకుంటుంది. చిన్నతనంలో మనం చేసిన చిన్న సహాయానికి లేదా పెట్టిన పెట్టుబడికి ఆ చెట్టు భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మనకు తిరిగి అందిస్తుంది. అలాగే చిన్నప్పుడు పిల్లలకు మంచి సంస్కారం, విద్యను అందిస్తే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారని ఈ సామెత చెబుతుంది.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘శంకర’’

‘శం’ అంటే అనంతమైన సుఖం/శాంతి అని అర్థం. ‘కర’ అంటే కలిగించేవాడు. ఎవరైతే తనను నమ్ముకున్న భక్తులకు, ఈ చరాచర జగత్తుకు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తారో ఆయనే శంకరుడు. మానవ జీవితంలో ఎదురయ్యే అశాంతిని దూరం చేసి, మనసును నిర్మలం చేసే దైవం ఆయన. లోక కల్యాణం కోసం నిరంతరం తపించేవాడు కాబట్టే ఆయనను దర్శించుకున్నా, స్మరించుకున్నా మనకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. సర్వ ప్రాణులకు శుభాన్ని కలిగించే మంగళకారి ఆయన.


